అంబటి, బుద్దా వెంకన్న మధ్య ట్వీట్ వార్

ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు నిన్న ర్యాంకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాంకింగ్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కు వచ్చిన ర్యాంకులపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. 'మంత్రివర్గపు ర్యాంకుల్లో 8, 9 స్థానాలను సాధించిన లోకేశ్, పవన్ లకు అభినందనలు' అని ట్వీట్ చేశారు.

దీనిపై బుద్దా వెంకన్న స్పందిస్తూ... 'అయ్యా అంబటి... 1, 2 స్థానాల్లోకి రావడానికి పవన్, లోకేశ్ కృషి చేస్తున్నారు. 11 స్థానాలతో ఉన్న మీ జగన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానానికి వచ్చేందుకు మరింత కృషి చేస్తున్నారు' అంటూ ఎద్దేవా చేశారు.

Ambati Rambabu
YSRCP
Jagan
Budda Venkanna
Telugudesam

More Telugu News